తెలంగాణ

వనపర్తి నిర్వాసితులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: వనపర్తి జిల్లాలోని శంకర సముద్రం ప్రాజెక్టు, శ్రీ రంగపురం రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్‌ల కింద ముంపునకు గురవుతున్న నిర్వాసితులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మూడు లేఖలు రాశారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకరసముద్రం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న కానాయిపల్లి గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. రెండవ లేఖలో ఎదుల రిజర్వాయర్‌లో వనపర్తి జిల్లా బండరాఘీపాకుల గ్రామం ముంపునకు గురవుతున్నందున పునరావాసం, ఉపాధి, భూనష్ట పరిహారంలో సవరణ చేసి గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరారు. మూడవ లేఖలో శ్రీ రంగాపురం మండలం శ్రీ రంగ సముద్రం రిజర్వాయర్ ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించి, వారికి మేలైన పునరావాస పథకాలు అమలు చేయాలని కోరారు.