తెలంగాణ

శంకర్ నాయక్‌ను అరెస్టు చేయాలి: టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: మహబూబాబాద్ జిల్లా మహిళా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని టి.టిడిపి మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ త్రిపురాన వెంకటరత్నంను కోరారు. టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు బండ్రు శోభారాణి అధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం డాక్టర్ త్రిపురాన వెంకటరత్నంను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అనంతరం శోభారాణి మీడియాతో మాట్లాడుతూ టిఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు కొందరు తమ అధికార పరిధిని దాటి అధికార యంత్రాంగంపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.