తెలంగాణ

సిబిఐ దర్యాప్తుపై అభిప్రాయం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: రాజధానిలో ఆజమాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో భూమి బదలాయింపు, అవకతవకలపై సిబిఐ చేత దర్యాప్తు చేయించే విషయమై రాష్ట్రప్రభుత్వం తన అభిప్రాయం తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన టిఆర్‌ఎస్ నేత కుమార్ ఈ విషయమై హైకోర్టుకు రాసిన లేఖను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ టి రజని విచారించారు. ఈ లేఖను పిల్‌గా పరిగణిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ముషీరాబాద్‌లో ఆజాంబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గతంలో 136 ఎకరాలు కేటాయించిందన్నారు. ఈ భూము లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, కొంత మంది ఇండ్లు కూడా నిర్మించుకున్నారన్నారు. ఈ విషయమై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని టిఆర్‌ఎస్ నేత కోరారు. ఈ లేఖను పిల్‌గా తీసుకుంటున్నట్లు హైకోర్టు ప్రకటించింది.