తెలంగాణ

హరిత హారంపై పోటీ పడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: హరిత హారంలో మొక్కలు నాటేందుకు పోటీ పడి లక్ష్యాన్ని అధిగమించాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు. హరితహారంపై ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు, వాటిలో ఎన్నింటికి రక్షణ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మొక్కలు నాటుతున్న ప్రాంతాలను వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ చేశారా? లేదా? క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఏమైనా ఎదురు అవుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలతో వాతావరణం అనుకూలిస్తుందని, దీనిని సమర్థవంతంగా వాడుకుని మొక్కలు నాటాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలని, గ్రీన్ బ్రిగేడ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ముఖ్యంగా పోటీతత్వం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హరితహారం కోసం 15 కోట్ల రూపాయలతో అవార్డులు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. అవార్డుల ఎంపికలో మొక్కలు నాటడంతో పాటు రక్షణ చర్యలు, జియో ట్యాగింగ్ ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ పరిథిలో హరితహారం కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. కాబట్టి వెంటనే మొక్కల లభ్యత, నర్సరీల వివరాలు ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.