తెలంగాణ

దేశానికే తెలంగాణ మార్గదర్శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడ డాక్టర్ జిఆర్ రెడ్డి అన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ (ఎంసిఆర్-హెచ్‌ఆర్‌డి)లో మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల అధికారులకు పునశ్చరణ, సామర్థ్యపు పెంపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిఆర్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ ప్రభుత్వం పలు భారీ ప్రాజెక్టులను చేపట్టినప్పటికీ రాష్ట్రంలోని మానవ వనరుల నాణ్యతపైనే వాటి విజయం ఆధారపడి ఉంటుందన్నారు. అపారమైన వనరులు ఉన్నప్పటికీ సుపరిపాలన ద్వారానే మెరుగైన అభివృద్ధి అందుకునేందుకు వీలుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎస్. ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, జగిత్యాల కలెక్టర్ ఎండి ముషారఫ్ అలీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కూడా ప్రసంగించారు.