తెలంగాణ

దక్షిణాసియా ప్రజల్లో అధికంగా జన్యుసంబంధ వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: దక్షిణాసియాలో 15 బిలియన్ ప్రజలు వంశానుగతమైన జన్యుసంబంధ వ్యాధులకు గురవుతున్నారని ఇదో అరుదైన అంశమని సిసిఎంబి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కె మిశ్రా చెప్పారు. సిసిఎంబి నిర్వహించిన పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు బట్టబయలు అయ్యాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు వ్యక్తిగత చికిత్సా విధానంలో సమగ్రమైన మార్పులకు బాట వేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాసియాలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా భవిష్యత్‌లో మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు కూడా దోహదం చేస్తుందని అన్నారు.
అనేక పరిశోధన సంస్థలు ఈ తాజా అధ్యయనంలో పాలుపంచుకున్నాయని, దక్షిణాసియాలో ప్రజలకు కొంత మందికి వచ్చే వ్యాధులకు వారి జన్యులిపిలో మార్పు (మ్యుటేషన్) కారణమని తేలిందని, దానిని గుర్తించేందుకు రిసెసివ్ జెనెటిక్ డిసీజెస్ (ఆర్‌జిడి)పై పరీక్షలు జరపడానికి ఆ తరహా వ్యాధుల భారాన్ని తగ్గించడానికి ఒక అసాధారణమైన అవకాశాన్ని ఈ అధ్యయనం ప్రసాదించిందని అన్నారు. దక్షిణాసియాలోని కొన్ని పూర్వ తెగల్లో ఈ కోవకు చెందిన మ్యుటేషన్ కలిగిన సందర్భాలను ఫౌండర్ ఈవెంట్స్‌కు సగోత్రికుల్లో వివాహం, అంతర్వివాహం (ఎండోగమి) తోడవడంతో వ్యాధులు వస్తున్నాయని తెలిందని చెప్పారు. ప్రపంచంలో అనేక చోట్ల జనాభా సంబంధ వ్యాధులు అధిక స్థాయిలో ప్రబలడానికి ఆస్కారం ఏర్పడుతోందని, దక్షిణాసియాలో మానవ విజ్ఞాన పరంగా చక్కని నిర్వచనం ఉన్న ప్రజలు దాదాపుగా ఐదు వేల మంది ఉన్నారని గుర్తించినా, మిగిలిన వారి జెనిటిక్ వ్యాధులకు కారణాలను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.