తెలంగాణ

నిజాంసాగర్‌లోకి 232 క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, జూలై 18: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, మంగళవారం 232 క్యూసెక్క్‌ల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ డిఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా, బాచెపల్లి, రాంరెడ్డిపేట్, నిజాంపేట్, శంకరంపేట్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా చేరుతున్నాయన్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన సింగూర్ ప్రాజెక్ట్ జలాశయంలోనికి కురుస్తున్న భారీ వర్షాలకు 1813 క్యూసెక్‌ల వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. సింగూర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు సింగూర్ జలాశయంలోవరద నీరు వచ్చి చేరుతోందన్నారు. సింగూర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 523.600 మీటర్లు కాగా, 521.025 మీటర్ల నీరు నిల్వఉందని, 29.910 టిఎంసిలకు 18.286 టిఎంసిల నీరు నిల్వఉందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో 1405.00 అడుగులు కాగా 1380.24 అడుగుల నీరు నిల్వఉందని, 17.802 టిఎంసిలకు 1.339టిఎంసిల నీరు నిల్వఉందని డిఈఈ తెలిపారు. పరిసర ప్రాంతాల్లోకురిసిన భారీ వర్షాలకు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.