తెలంగాణ

రైతు భూములకు రక్షణ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 18: సాగునీటి ప్రాజెక్టుల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటుందని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల గుండా నిర్మిస్తున్న హై టెన్షన్ విద్యుత్ టవర్ల భూ నిర్వాసితులను మంగళవారం ఆయన సంగారెడ్డిలో పరామర్శించారు. ఈ సందర్భంగా కంది గ్రామానికి చెందిన దుర్గయ్య, వెండ్రికోల్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి, లక్ష్మీలు విద్యుత్ హై టెన్షన్ టవర్ల నిర్మాణం వల్ల కలుగుతున్న ఇబ్బందులు, నష్టపోతున్న భూమిపై బాధితులు కోదండరాంతో మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల బతుకులు బాగుపడుతాయని బావిస్తే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అందుకు విరుద్దంగా ఉందని విచారం వ్యక్తం చేసారు. ప్రాజెక్టుల పేరిట సరియైన పరిహారం అందించకుండా బలవంతంగా భూములను తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్నారు. రైతులకు భూమిపై హక్కు లేకుండా ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని ధ్వజమెత్తారు. విద్యుత్ టవర్ల నిర్మాణం వల్ల నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని కలెక్టర్ ఇచ్చిన సర్క్యూలర్ ప్రకారంగా విద్యుత్ సంస్థలు పరిహారం అందించాలన్నారు. రైతులకు న్యాయం చేకూర్చే బాధ్యత కలెక్టర్‌పైనే ఉందని, కలెక్టర్ అనుమతించకపోతే టవర్ల నిర్మాణం జరిగేది కాదన్నారు. కలెక్టర్ స్పందించలేని పక్షంలో కోర్టును సైతం ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణలో కూడా ప్రభుత్వం తగిన పరిహారం అందించకుండా అన్యాయానికి గురి చేస్తుందన్నారు. భూ నిర్వాసితులను పరామర్శించడానికి వెళితే సెక్షన్ 30 అమల్లో ఉందని అక్రమంగా అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. సెక్షన్ 30 యాక్టు అమలులో ఉంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని, కేవలం రైతు ఇళ్లలో కూర్చు ని మాట్లాడితే కూడా సెక్షన్ 30 యాక్టు ఉందని చెప్ప డం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టులైనా, విద్యుత్ టవర్లైనా ఇంకేదైనా రైతులకు సరియైన పరిహారం అందించి న్యాయం చేకూర్చకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం మొండి గా వ్యవహరిస్తూ చూస్తు ఊరుకోమని, న్యాయపోరాటం చేస్తామని కోదండరాం ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందోల్ క్రిష్ణతో పాటు పలు గ్రామాలకు చెంది న రైతులు పాల్గొన్నారు.