తెలంగాణ

నేతన్నకు చేతినిండా పని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: నేత కార్మికులకు ఏడాది పొడవునా చేతి నిండా పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేత, చేనేత రంగాలను ఆదుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. ప్రభుత్వానికి అవసరమైన వస్త్రాలను రాష్ట్రంలోని కార్మికుల నుంచే తప్పనిసరిగా కొనుగోలు చేసే విధంగా విధానపరమైన నిర్ణయం తీసుకోబోతున్నామని మంత్రి తెలిపారు. నేత కార్మికుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు, పథకాలకు సేకరించే ప్రతి మీటర్ వస్త్రాన్ని స్థానికంగా కొనుగోలు చేయడానికి వార్షిక క్యాలండర్‌ను విడుదల చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. రాజీవ్ విద్యా మిషన్ కోసం సేకరించే వస్త్రాలను గతంలో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేవారని, అయితే గతేడాది నుంచి సిరిసిల్ల నేత కార్మికుల నుంచే తక్కువ రేటుకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల సంక్షోభంలో ఉన్న మరమగ్గ కార్మికులకు ఊరట లభించిందని మంత్రి గుర్తు చేశారు. విడుదల చేసిన క్యాలండర్ ప్రకారం మే నుంచి ఆగస్టు నెలల్లో బతుకమ్మ చీరలు, డిసెంబర్ నుంచి మార్చి నెలల్లో సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ విద్యార్థుల యూనిఫామ్‌ల కొనుగోలు, అక్టోబర్ నెలలో క్రిస్‌మస్ పండుగలో పంపిణీకి వస్త్రాల కొనుగోలు, ఏప్రిల్ నెలలో రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీ చేసే వస్త్రాలు కొనుగోలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది నుంచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని 95 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. వీటిలో సగం చీరలను సిరిసిల్ల నేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలు 30 లక్షలు, రంజాన్‌కు 36 లక్షలు, క్రిస్‌మస్‌కు 27 లక్షలు, కిసిఆర్ కిట్లు, ఇతర అవసరాలకు 25 లక్షల మీటర్ల వస్త్రాలను ఏడాది వ్యవధిలో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. తాము ప్రకటించిన క్యాలండర్ మేరకు సిరిసిల్లాలోని 35 వేల మరమగ్గాలలో పని చేస్తున్న కార్మికులతో పాటు ఇతర ప్రాంతాల్లోని కార్మికులకు ఉపాధి లభిస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.