తెలంగాణ

జిఎడి పోర్టల్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: సాధారణ పరిపాలనా శాఖ రూపొందించిన పోర్టల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ గురువారం ఆవిష్కరించారు. జిల్లాల్లో పని చేసే అధికారులు ఇక నుంచి సచివాలయానికి రాకుండానే పోర్టల్ ద్వారా సెలవులు, ఎల్‌టిసి వంటి వాటికి అనుమతులు పొందవచ్చని ఈ సందర్భంగా ఎస్‌పి సింగ్ అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ పథకాలు అమలు జరుగుతుండడం వల్ల జిల్లాల నుంచి అధికారులు సచివాలయానికి రాకుండానే పోర్టల్ ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని అన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సచివాలయం పాటు ఇతర కార్యాలయాల్లో పని చేసే అధికారులు, జిల్లాల్లో పని చేసే అధికారులకు సంబంధించిన వివరాలను పోర్టల్‌లో పొందుపరిచినట్టు చెప్పారు. ఈ పోర్టల్‌లో 137 మంది అధికారుల సమగ్ర సమాచారం ఉందని, ఇక మీదట అఖిల భారత సర్వీసుల అధికారులు తమకు కావాల్సిన అనుమతులు, సాధారణ సెలవులు, సంపాదిత సెలవులు, ఎల్‌టిసి వంటి అన్ని సౌకర్యాలను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని వివరించారు.

చిత్రం.. సాధారణ పరిపాలనశాఖ రూపొందించిన పోర్టల్‌ను ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్