తెలంగాణ

వయసుకు తగ్గ పనులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న డ్రగ్ మాఫియాపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రాష్ట్ర మంత్రి కెటి రామారావు మధ్య ట్విట్టర్‌లో మరోసారి మాటల యుద్ధం జరిగింది. డ్రగ్ మాఫియాపై దిగ్విజయ్ సింగ్ గురువారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. డ్రగ్ మాఫియాను ప్రభావితం చేసే వారు టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారని, వీరి మిత్రులు కూడా మాఫియాలో భాగస్తులని, వీరిని కూడా సిట్ విచారిస్తుందా లేక రక్షిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఈ విషయమై వేచిచూడాలని పేర్కొన్నారు. దీనిపై మంత్రి కెటిఆర్ తీవ్రంగానే స్పందించారు. దిగ్విజయ్ సింగ్ పూర్తిగా ఓడిపోయారని, ఇక నైనా వయసుకు తగిన పనులు చూసుకోవాలని హితవు చెబుతూ ట్వీట్ చేశారు. ట్వీట్‌లో తెలంగాణ స్పెలింగ్‌ను సరిగ్గా రాసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో కూడా తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి జీహాది పట్ల ఆకర్షితులయ్యే యువకులను తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారంటూ దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించగా, డిజపితో సహా పోలీసు శాఖ, ప్రభుత్వం తీవ్రంగా స్పందించి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను అసమంజసమైనవని, పసలేనివని కొట్టిపారేసిన సంగతి విదితమే.