తెలంగాణ

మెడికల్, డెంటల్ అడ్మిషన్ల షెడ్యూలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20 : రాష్ట్రంలోని ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 17,128 దరఖాస్తులు వచ్చినట్టు కెఎన్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ బి కరుణాకర్‌రెడ్డి గురువారం నాడు చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలన, వెబ్ ఆధారిత కౌనె్సలింగ్ షెడ్యూలును విడుదల చేశారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఈ నెల 22 నుండి 27వ తేదీ వరకూ కొనసాగిస్తామని ఇందుకోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. నాల్ లోకల్ అభ్యర్ధులకు డాక్టర్ ఎన్‌టిఆర్ యుహెచ్‌ఎస్(విజయవాడ)లోనూ, వరంగల్ కాకతీయ యూనివర్శిటీ, ఒయు దూర విద్యా కేంద్రంలోనూ, జెఎన్‌టియు కూకట్‌పల్లిలోనూ, ఎవి కాలేజీలోనూ ఈ వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అభ్యర్ధుల మెరిట్ జాబితాలను, స్పెషల్ కేటగిరి జాబితాలను, ఇతర వివరాలను నోటిఫికేషన్‌లో ఇచ్చామని చెప్పారు. సిఎపి స్పెషల్ కేటగిరి 22న 8.30 గంటలకు, స్పోర్ట్సు కేటగిరి 12వేల ర్యాంకు లోపు వారు ఉదయం 8.30 గంటలకు, 12వేల ర్యాంకు దాటిన వారు మధ్యాహ్నం 1.30 గంటలకు కూకట్‌పల్లి జెఎన్‌టియు క్యాంపస్‌లో హాజరుకావాలని అన్నారు. పిఎంసి కేటగిరి 22 మధ్యాహ్నం 3 గంలకు, పిహెచ్ కేటగిరి 23వ తేదీ ఉదయం 8.30 గంటలకు, ఎన్‌సిసి కేటగిరి 23వ తేదీ ఉదయం 8.30కు 10వేల లోపు ర్యాంకర్లు అంతకు మించిన వారు మధ్యాహ్నం 1.30కు హాజరుకావాలని సూచించారు. అన్ని డాక్యుమెంట్లతో అభ్యర్ధులు హాజరుకావాలని, నాన్‌లోకల్ అభ్యర్ధులు విజయవాడ ఎన్‌టిఆర్ యుహెచ్‌ఎస్‌లోనే హాజరుకావాలని పేర్కొన్నారు.
బి , సి కేటగిరిలకు దరఖాస్తుల స్వీకారం
బి కేటగిరి, సి కేటగిరి సీట్లకు సైతం ఆన్‌లైన్‌లోనే అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వివరించారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటల నుండి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్ డాట్ ఇన్ లేదా టిఎస్‌పివిటి మెడ్‌ఎడిఎం డాట్ టిఎస్‌సిహెచ్‌ఇ డాట్ ఇన్ అనే వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.