తెలంగాణ

రైతు సమస్యలు కెసిఆర్‌కు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 20: కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతులను బిచ్చగాళ్లుగా చేస్తోందని ఎకరాకు నాలుగు వేలు ఇవ్వడం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం కావ ని, ఆత్మహత్యలు ఆగబోవని బిజెపి శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం బిజెపి కిసాన్ మోర్చా నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిర్వహించిన రైతు పోరు దీక్షలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ విధానాలపై నిప్పులు చెరిగారు. శాసనసభలో, బయటగాని ఎక్కడా ఏ పార్టీ ఎమ్మెల్యే కూడా రైతులకు ఎకరాకు నాలుగు వేలు ఇవ్వమని కోరలేదన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో నాలుగు వేల రూపాయల పథకం, రైతు సమాఖ్యలు వృథా ప్రయాసనే అవుతాయన్నారు. రైతుల దిగుబడులకు గిట్టుబాటు ధర అందించే వ్యవస్థ ఏర్పాటు మాత్రమే రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి మార్గమన్నారు. పంటల బీమా పథకం అమలు, కోరిన వెంటనే పంట రుణాలు, గిట్టుబాటు ధర వ్యవస్థలతోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలకు అందిస్తున్న మద్ధతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా బోనస్ అందించి రైతులను ఆదుకోవాలన్నా రు. దేశాన్ని, రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ రైతులకు సమగ్ర పంటల బీమా అందించలేదన్నారు. మోదీ ప్రభు త్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే పథకాల దిశగా ఫసల్ బీమా యోజన అమలు చేయగా రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం తన వాట నిధులివ్వడానికి వెనుకడుగు వేస్తూ రైతులను ఫసల్ బీమా యోజనలో చేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. టిఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని రీతిలో నాలుగు దఫాలుగా రైతు రుణమాఫీ ప్రకటించి అమలులో వైఫల్యం చెందడంతో రైతులకు ఫసల్ బీమా పథకం, కొత్త పంట రుణాలు అం దకుండా నష్టం జరుగుతోందన్నారు. తెలంగాణలోని 56 లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా కేవలం లక్షన్నర మం దినే ఫసల్ బీమాలో చేర్చగా మరో 55లక్షల మందికి బీమా పథకం అందకుండా కెసిఆర్ ప్రభుత్వ చేస్తోందన్నారు. పైగా కేంద్ర నిధులతో అమలు చేసే ఫసల్ బీమా పథకం ప్రచార కరపత్రంలో ప్రధాని మోదీ ఫొటో వేయకుండా కెసిఆర్, పోచారంల ఫోటోలను పెట్టుకుని ప్రచా రం చేసుకోవడం విడ్డూరమన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా ఆదుకుంటుందని ఈ బీమా పథకంలో చేర్చేందుకు తెలంగాణ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాల్లోని మూతపడిన ఎరువుల కర్మాగారాలను తెరిపిస్తూ, ఎరువుల అక్రమ వ్యాపారాన్ని నిరోధించి ఎరువులకు రైతులు పడిగాపులు పడకుండా చేసిందన్నారు. దేశంలో ఒకే సమయంలో రైతు బిడ్డ వెంకయ్యనాయుడిని ఉప రాష్టప్రతిగా, బిసి వర్గం మోదీని ప్రధానిగా, దళితుడైన కోవింద్‌ను రాష్టప్రతిగా చేసి బడుగు, బలహీన వర్గాలు, రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ రైతు పోరు దీక్షలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్వి కె.శ్రీ్ధర్‌రెడ్డి, కరుణ, చంద్రశేఖర్, ఒరుగంటి రాములు, అశోక్ పాల్గొన్నారు.

చిత్రం.. నల్లగొండ కలెక్టరేట్ వద్ధ బిజెపి రైతు పోరు దీక్షలో మాట్లాడుతున్న బిజెఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి