తెలంగాణ

ఏజెన్సీలో మళ్లీ మావోల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట, జూలై 20: గత కొంత కాలంగా స్తబ్దతగా ఉన్న ఏజెన్సీలో మళ్లీ మావోల కలకలం మొదలైంది. నక్సల్స్‌కు పట్టుకొమ్మలా ఉన్న పస్రా అటవీప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో గత కొన్ని సంవత్సరాల నుండి పస్రా అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉనికి తగుముఖం పట్టింది.
ఈ క్రమంలో మావోలు మళ్లీ తమ ఉనికి చాటుకోవడంతోపాటు తమ పాత ప్రాబల్యాన్ని పెంచుకునే క్రమంలో గోవిందరావుపేట, పస్రా జాతీయ రహదారి వెంట సిపిఐ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో వారోత్సవాలను విజయవంతం చేయాలని, అమరుల త్యాగాలను, సాహసాలను స్మరించుకోవాలంటూ కరపత్రాలలో పిలుపునిచ్చారు. గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై కరపత్రాలను పంపిణీ చేసినట్టు తెలిసింది. అయితే బుధవారమే పోలీస్ ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈనెల 28 నుండి ఆగస్టు 3 వరకూ జరగనున్న మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేసిన 24 గంటలు తిరగక ముందే భూపాలపల్లి జిల్లా గోవిందరావుపేట, పస్రా గ్రామాలతోపాటు తాడ్వా యి మండల కేంద్రంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కరపత్రాలు పంపిణీ చేయడం ఏజెన్సీలో మళ్లీ కలకలం మొదలైంది. హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు సాగుభూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని, నిరుపేద రైతులను పాలకులు పూర్తిగా విస్మరిస్తూ పోలీస్‌శాఖ కోట్లాది రూపాయల నిదులు వెచ్చించి తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ ఈ కరపత్రాలలో ప్రభుత్వ తీరుపై మావోలు ఆగ్రహం వ్యక్తం చేశారు.