తెలంగాణ

బోసిపోతున్న ప్రధాన ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 20: చుట్టపుచూపుగా పలకరిస్తున్న చెదురుముదురు వానలు తప్ప, ఆశించిన రీతిలో ఏకధాటిగా వర్షాలు కురియని కారణంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ అడుగంటిన నీటి నిల్వలతో వెలవెలబోతున్నాయి. గతేడాదితో ఇదే సమయానికి పోలిస్తే దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్లోనూ గణనీయంగా నీటిమట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉంటే, సాగునీటి మాటెలా ఉన్నా తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని చూసి జిల్లా రైతాంగం కూడా ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగుపై ఒకింత అనుమానాలతోనే ముందుకు సాగుతున్నారు. నిన్నమొన్నటి వరకైతే వరి పంట సాగు విస్తీర్ణం పూర్తిగా పడకేయగా, ఇటీవల నాలుగు రోజుల నుండి ఒక మోస్తారుగా కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. అయితే భారీ వర్షాల జాడ మాత్రం లేకపోవడంతో పంటలను కాపాడుకోగల్గుతామో లేదోనన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆశించిన స్థాయిలో వరద జలా లు వచ్చి చేరలేదు. దీంతో కనీసం అర టిఎంసి నీటి నిల్వలు కూడా పెరగలేకపోయాయి. ఉమ్మడి జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టు గతేడాది కొంత ఆలస్యంగానైనా పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకుని ఆయకట్టు రైతుల్లో ఎనలేని భరోసాను నింపింది.
వరద జలాలు పోటెత్తడంతో మిగులు జలాలను దిగువ మంజీరాలోకి వదలాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా సీజన్ చివరి నాటికి పరిస్థితి అనుకూలించకపోతే మాత్రం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని స్పష్టమవుతోంది. 1405 అడుగులు, 17.8టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన నిజాంసాగర్‌లో ప్రస్తుతం 1380 అడుగులు, 1.3టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఒక టిఎంసి వరకే నీటి నిల్వలు పరిమితం అవగా, వాటిని కనీసం బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు కూడా వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. బాద్ ఉమ్మడి జిల్లాకు ‘నీటి’ గండం దూరం కాలేకపోతోంది.