తెలంగాణ

అందుబాటులో డయాలసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 20: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో 39చోట్ల డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. వాటి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, రెండు నెలల్లో వాటిని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి ఆవరణలో రూ.20కోట్లతో నూతనంగా నిర్మించిన 150 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని లక్ష్మారెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 ఆసుపత్రుల్లో ఐసియు కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో డ్రెస్ కోడ్‌తో రోగులను ఆనందంగా రీసివ్ చేసుకోవడంతో పాటు మంచిగా చూసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని నిర్ణయించామ ని, త్వరలోనే వారిని నియమిస్తామన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించడమే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ, అధిక నిధులు కేటాయిస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తున్నదని అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ గొప్ప పథకమన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రుల్లో ఐసియులు ఏర్పాటు చేయలేని స్థితిలో వారి పాలన కొనసాగిందని దుయ్యబట్టారు. కానీ బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం గా ఆరోగ్య తెలంగాణ సాధించడమే కెసిఆర్ ప్రభు త్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు సమూల మార్పులు చేస్తూ ఆధునీకరిస్తున్నామని, ఆసుపత్రుల్లో మంచి వాతావరణం ఉండేలా అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కార్పోరేట్ స్థాయిలో అత్యాధునిక పరికరాలను సమకూరుస్తున్నామని తెలిపారు.
ఇప్పుడిప్పుడే ప్రజల్లో ప్రభుత్వాసుపత్రులపై విశ్వాసం కలుగుతోందని చెప్పా రు. వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అన్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ఏవైతే ఆలోచనలు చేశారో వాటిని సాకారం చేసేందుకు కృషిచేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రులను చూసి మాఆసుపత్రులు నడుస్తాయో లేదోనని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహకులు ఆవేదన పడుతున్నారని అన్నారు.
జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎమ్మెల్యేలు గం గుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్‌సింగ్, గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వౌళిక వసతుల సదుపాయాల సంస్థ చైర్మన్ పర్యాద క్రిష్ణమూర్తి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్‌లతోపాటు పలువురు వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మాతా శిశు ఆరోగ్య సంక్షరణ కేంద్రం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి