తెలంగాణ

మిషన్ భగీరథ 75 శాతం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: రాష్ట్రంలో అమలు జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో 75 శాతం పూర్తయినట్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి) సురేందర్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పైప్‌లైన్‌తో పాటే డక్ట్ వేసిన పదివేల కిలోమీటర్ల పరిధిలో ఫైబర్ వేసేందుకు అంతా సిద్ధమైందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ డక్ట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి అనుసరించాల్సిన విధానాన్ని ఎస్‌ఈ, ఈఈలకు ఐటి శాఖ ప్రతినిధులు వివరించారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఐటి శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పనుల్లో పురోగతి సాధించాలని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న 50 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో 15 పూర్తయ్యాయని, 25 ప్లాంట్ల నిర్మాణం చివరి దశలో ఉందని, మిగిలిన 10 ప్లాంట్ల నిర్మాణం 75 శాతం పూర్తయ్యిందని అన్నారు. ఈ నెల చివరి నాటికి 27 ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, వచ్చే నెల 31 నాటికి ఎలక్ట్రో మెకానికల్ పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.