తెలంగాణ

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెను సవాలుగా మారుతున్నాయని డాక్టర్క్ వితౌట్ బోర్డర్స్/మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్‌ఎఫ్) సంస్ధ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ కాంప్రెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ (ఆర్‌సిఇపి) పేరిట స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలకు వచ్చే వారం హైదరాబాద్ హైటెక్స్ వేదిక కాబోతున్నదని ఎంఎస్‌ఎఫ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎంఎస్‌ఎఫ్‌కు చెందిన అక్సాస్ క్యాంపైన్ సౌత్ ఆసియా రీజినల్ హెడ్ లీనా మెన్‌హెనీ, డిప్యూటీ హెడ్ శైలి గుప్తా, ప్రజా సంఘాల నాయకుడు కిరణ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రమాదమని అన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఆర్‌సిఇపి) డబ్ల్యుటివో కంటే ప్రమాదకరమని 30 రైతు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని వారు తెలిపారు. ఈ ఒప్పందం డబ్ల్యుటివో కంటే ప్రమాదకరమైందని, విత్తన రంగంలో పెటేంట్ పొందినట్లే, ఔషధాల విషయంలోనూ పెటెంట్ విదేశీ కంపెనీలు పెటేంట్ పొందుతాయని వారు హెచ్చరించారు. జపాన్, సౌత్ కొనియా దేశాలు, ఆసియాకు చెందిన 10 దేశాలు, మందుల ఉత్పత్తి కంపెనీలు గుత్త్ధాపత్యాన్ని కలిగి ఉండే విధంగా ఒప్పందంపై వత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నాయని వారు తెలిపారు. దీంతో జెనరిక్ మందుల ఉత్పత్తిలో పోటీతత్వం తగ్మిందుల కొనుకోలు ఖరీదు విపరీతంగా పెరిగి, చివరకు పేద, మధ్య తరగతి వ్యాధిస్త్రులకు మందులు అందుబాటులో ఉండవన్నారు. అనేక కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా వ్యవహారించాలని వారు కోరారు. ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలు మందుల కొనుగోలుకు మన దేశంపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. మందుల తయారికి సంబంధించిన నిబంధనలు రహస్యంగా ఉంచాలని, ఐదు సంవత్సరాల పాటు నిబంధనల్లో ఎటువంటి మార్పులు చేయలేని విధంగా ఉండేలా జపాన్, సౌత్ కొనియా దేశాలు భారత్‌పై వత్తిడి తెస్తున్నట్లు ఎంఎస్‌ఎఫ్‌కు చెందిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారని వారు తెలిపారు.
కాబట్టి ఈ ఒప్పందాలు జరగకుండా వత్తిడి తెచ్చేందుకు రైతు, వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలతో ఈ నెల 23న (ఆదివారం) బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సదస్సు నిర్వహించనున్నట్లు కిరణ్ విస్సా తెలిపారు. 24న ఉదయం నెక్లెస్ రోడ్డు (పీపుల్స్ ప్లాజా)లో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.