తెలంగాణ

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నిధులు స్టేట్ హెల్త్ సొసైటీకి కేటాయంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ద్వారా వస్తున్న నిధుల్లో రూ.1532 కోట్లను స్టేట్ హెల్త్ సొసైటీకి కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన స్టేట్ హెల్త్ సొసైటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. 50 పడకలతో ఉన్న మాతా శిశు వైద్య శాలలు మరో 10 ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాకో సమగ్ర వ్యాధుల నివారణ కేంద్రం, కొత్తగా మూడు డిస్పెన్సరీలు, 1248 అదనపు ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు కూడా అనుమతించినట్లు ఆయన తెలిపారు. అమ్మ ఒడి పథకానికి మరో 200 వాహనాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. మందులు, పరికరాలకు మరిన్ని నిధులను వెచ్చించాలని చెప్పారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు 12 కంగారూ మదర్ కేర్ యూనిట్లు, 12 డిఇఐసిలను నిలోఫర్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ కరుణ, తదితరులు పాల్గొన్నారు.