తెలంగాణ

పరిశుభ్ర పట్టణాలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: వచ్చే నెల ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన పట్టణాలుగా ప్రకటిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. సచివాలయం నుంచి శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కెటిఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆలోచన, లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోకపోతే మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాలను పరిశుభ్ర పట్టణాలుగా తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
టాయిలెట్ల నిర్మాణం శరవేగంగా జరగలన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రతి మున్సిపాల్టీ ఒడియప్ స్టేటస్ అందుకోవాలన్నారు. మధిరా, బైంసా, భువనగిరి, సత్తుపల్లి, అచ్చంపేట, హుజురాబాద్, హుజూర్‌నగర్, గజ్వేల్, జగిత్యాల్, షాద్‌నగర్, సూర్యాపేట, సిద్దిపేట, సిరిసిల్లా, బోడుప్పల్, నర్సంపేట మున్సిపల్టీలు ఇప్పటికే ఒడియప్ స్టేటస్ పొందాయని మంత్రి వివరించారు. వర్షకాలంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. శిథిల భవనాలు, నాలలపై కబ్జాలు తొలగించి పుడికతీత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల రెండవ వారంలో అన్ని పట్టణాలకు స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేస్తామన్నారు. దీపావళి నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో వీధి దీపాలకు ఎల్‌ఇడి బల్బులు అమర్చాలన్నారు. పట్టణాలలో డంప్ యార్డుల వద్ద సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. పట్టణాలు అభివృద్ధిలో కార్యక్రమాల అమలులో ముందు వరుసలో ఉన్నాయని, వీటిపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. త్వరలో మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో హైదరాబాద్‌లో విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశం మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సిడియంఏ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. శుక్రవారం సచివాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్