తెలంగాణ

జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ మధ్య సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: హుజూరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా పరకాల-హుజురాబాద్ రోడ్‌పై ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే లైన్‌పై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇందుకు అవసరమైన డిజైన్ ఖరారు చేశామని, రానున్న 18 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి రైల్వే ఇంజనీర్లకు సూచించారు. శుక్రవారం నాడిక్కడ సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ బ్రిడ్జి ఇంజనీర్ బి.అశోక్ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి బ్రిడ్జి నమూనా, తదితర వివరాలను వివరించారు. బ్రిడ్జితో పాటు దాని పక్కన సర్వీస్ రోడ్లు కూడా నిర్మిస్తున్నట్లు మంత్రికి తెలిపారు. ఈ బ్రిడ్జి కలకత్తాలోని హౌరా బ్రిడ్జిని పోలి ఉంటుందని, సస్పెన్షన్ కలిగి ఉండడం ఈ బ్రిడ్జి ప్రత్యేకతగా రైల్వే ఇంజినీర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బ్రిడ్జి నమూనాను ఖరారు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా ఈ బ్రిడ్జి నిర్మాణ చేపట్టేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆర్‌ఓబి లేకపోవడం వల్ల రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున ఈ వంతెన నిర్మాణాన్ని అధిక ప్రాధాన్యతగా గుర్తించి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రైల్వే ఇంజనీర్‌కు మంత్రి సూచించారు. ఆర్‌ఓబితో పాటు పరకాల హుజూరాబాద్ రోడ్ నిర్మాణం పూర్తయితే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చిత్రం.. బ్రిడ్జి డిజైన్‌ను పరిశీలిస్తున్న మంత్రి ఈటల