తెలంగాణ

విద్యాసంస్థల బంద్ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్యా కార్యాచరణ కమిటీ శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఒక దశలో ర్యాలీ నిర్వహించాలని ప్రయత్నించడంతో నగరంలో భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు మధ్య విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు, ఉద్రిక్తత ఏర్పడింది. ఓక దశలో పోలీసులతో నేతలు బాహాబాహీకి దిగడంతో వారిని అరెస్టు చేసి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్టక్రార్యదర్శి కోట రమేష్, పిడిఎస్‌యు రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ ప్రదీప్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు రాము, ఎఐఎఫ్‌డిఎస్ రాష్ట్ర అధ్యయుడు రాజశేఖర్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తి వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. సమస్యలపై ప్రజాస్వామ్య యుతంగా బంద్‌కు పిలుపునిస్తే ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని జిల్లాల్లో నాయకులను బెదిరిస్తూ బంద్‌లు జరగకుండా అడ్డుకుంటోందని నేతలు పేర్కొన్నారు.
కెసిఆర్ పాలన మొదలై మూడేళ్లు పూర్తయినా ఒక్క సమస్యకూ పరిష్కారం దొరకలేదని అన్నారు. వేలాదిగా ఉపాధ్యాయ పొస్టులు, లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఉద్యమాల్లో పాల్గొన్న నేతలపై పెట్టిన కేసులు తొలగించి వారిని విడిచి పెట్టాలని సూచించారు. కొన్ని జిల్లాల్లో విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సమస్యలను పరిష్కరించకపోగా ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయాలని చూస్తోందని వారు చెప్పారు. ఎంత నిర్బంధం చేసినా, ఆటంకాలు కలుగజేసినా బంద్ విజయవంతం చేస్తామని తెలిపారు. ఫీజుల నియంత్రణ చట్టం చేస్తామని చెప్పి దానికో కమిటీ వేసి కాలయాపన చేస్తోందని , ఏ రాష్ట్రంలో లేనన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తెలంగాణలో ఉన్నాయని, ఫీజుల దోపిడీని విచ్చలవిడిగా కొనసాగుతున్నా కనీసం చర్యలు లేవని , ఫీజుల కమిటీ వేసినా చర్యలు లేవని అన్నారు. గత మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వేల కోట్ల రూపాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై కిడ్నాప్ కేసులు పెడుతున్నారని వాపోయారు.
ఈ బంద్ పిలుపునకు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్, డివైఎఫ్‌ఐ తదితర విద్యార్ధి సంఘాలు కూడా మద్దతు పలికాయి.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులను అడ్డుకుని అరెస్టు చేస్తున్న పోలీసులు