తెలంగాణ

ముత్తూట్ కేసులో నలుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, జూలై 21: మైలార్‌దేవ్‌పల్లి ముతూట్ ఫైనాన్స్ చోరికి యత్నించిన కేసులో నలుగురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముతూట్ ఫైనాన్స్ దోపిడి చేయడానికి ఏడుగురు నిందితులు ప్రయత్నించగా వారిలో నలుగుర్ని అరెస్టు చేశామని ముగ్గురు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్ జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం తెలిపారు. దోపిడీకి యత్నించిన ముఠాలో ఐదుగురు మహారాష్టక్రు చేందిన వారు కాగా ఇద్దరు హైదరాబాద్‌కి చేందిన వారని ఆయన తెలిపారు. ప్రధాన నిందితుడు షరీప్ పరారీలో ఉన్నాడని చెప్పిన ఆయన ముంబాయికి చేందిన అర్షద్ ఫూలీముద్దీన్ ఖాన్(28) షార్ఫూద్దీన్ నవాబుద్దీన్ సయ్యద్(30) సంతోష్ దశరత్ వీర్‌కర్(35) మహ్మద్ దస్తాగిరి(55) లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నెల రోజుల నుండి భద్రతలేని ఫైనాన్స్ సంస్థలను పరిశీంచారని, గత నెల 3న నగరాకి వచ్చి చంద్రాయణగుట్ట నివాముండే దస్తాగిరి ఇంట్లో తలదాచుకుని ఉదయానే మైలార్‌దేవ్‌పల్లిలోని ముతూట్ ఫైనాన్స్ దోపిడీకి యత్నించారని తెలిపారు. మైలార్‌దువ్‌పల్లి ముతూట్‌లో భద్రత లేకపోవడంతో పాటు పారిపోవడానికి అనుకూలంగా ఉండడంతో యత్నించారని తెలిపారు. ఎలాంటి అధారాలు దొరకక పోయిన నిందితులను పట్టుకునట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో నిందితులు వాడిన తవేరా వాహనంతో పాటు అందులో దొరికిన ప్లాస్టిక్ కవరే కీలక ఆధారంగా మారాయని వివరించారు. తవేరా వాహనాన్ని గుజరాత్ దొంగిలించి దానితోనే దోపిడీలు చేస్తున్నారని చెప్పారు. నిందితులందరు మహారాష్టల్రోని ధుల్యా సబ్ జైల్‌లో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ప్రధాన నిందితుడు షరీఫ్, అర్షద్ ఖాన్‌లు 2014లో ఫైనాన్స్‌లు దోపిడీ చేసిన కేసులో నిందితులని మూడో నిందితుడు నకిలీ నోట్ల చేలామణిలో జైలుకు వెళ్లారని ఆయన తెలిపారు. దస్తగిరి, మరో నిందితుడు అన్న (పరారీలో ఉన్న వ్యక్తి) వీరిద్దరు మహారాష్ట్ర ముఠాతో చేతులు కలిపి దోపిడీకి ప్రయత్నించారన్నారు. కేసు దర్యాప్తుకి సిసిపూటేజ్, ఫింగర్ ప్రింట్ల ఆధారంగా నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల నుండి తవేరా కారు, రెండు కత్తులు, ఇనుప రాడ్, నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

చిత్రం.. ముత్తూట్ ఫైనాన్స్‌ను దొపిడీ చేసేందుకు యత్నించిన నిందితుల వివరాలను వెల్లడిస్తున్న
జాయింట్ సిపి షానవాజ్ ఖాసిం ఇతర అధికారులు