తెలంగాణ

పరాకాష్ఠకు చేరిన నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 21: నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన రమావత్ కవిత అనే గిరిజన మహిళ ప్రభుత్వాసుపత్రిలోని బాత్‌రూంలో ఒక మగశిశువుకు జన్మనిచ్చింది. దీనిని గమనించిన సిబ్బంది డ్యూటీలో ఉండే వైద్యురాలు శశికళకు సమాచారమందించినా ఆమె సకాలంలో ఆసుపత్రికి రాలేదు. దీంతో విధుల్లో ఉన్న ఇతర సిబ్బందే వైద్యం అందించి మరో శిశువుకు పురుడు పోసేందుకు యత్నించటంతో శిశువు మృత్యువాత పడ్డాడు. సంచలనం కలిగించిన ఈసంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయ. చందంపేట మండలం పోలెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సీత్యాతండాకు చెందిన కవితకు పెద్దఅడిశర్ల మండలం నంబాపూర్ తండాకు చెందిన కృష్ణతో సుమారు ఎనిమిదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఏడేళ్ళ వయసున్న కూతురు ఉండగా, రెండోసారి గర్భం దాల్చిన కవిత దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యురాలు శశికళ ప్రైవేటుగా నిర్వహించే ఆసుపత్రిలో సేవలు పొందుతోంది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కవితకు నొప్పు లు తీవ్రంగా రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయతే ఆసుపత్రిలోని సిబ్బంది సరిగా స్పందించలేదు. పురిటి నొప్పులతో అల్లాడుతున్న కవిత మలవిసర్జన కోసం ఆసుపత్రిలోని బాత్‌రూంలోకి వెళ్లి అక్కడే మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కవిత కేకలు వేయడంతో గమనించిన తోటి రోగులు సమాచారాన్ని ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. దీంతో బాత్‌రూం వద్దకు చేరుకున్న సిబ్బంది కవితను మగశిశువును తీసుకెళ్ళి ఆసుపత్రి కాన్పుల గదిలోకి చేర్చారు. కవితకు మళ్ళీ పురిటి నొప్పులు వస్తుండటంతో, అక్కడి సిబ్బంది ఆన్ డ్యూటీ వైద్యురాలు శశికళకు సమాచారమిచ్చిప్పటికీ ఆమె సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేదు. దీంతో సిబ్బందే వైద్యుల అవతారమెత్తి కవితకు కాన్పుచేసే యత్నం చేశారు. ఈక్రమంలో మరో మగశిశువు పుట్టబోతూనే మృత్యుపడ్డాడు. దీనిపై కవిత కుటుం బ సభ్యులు తీవ్రస్థాయలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శశికళ సకాలంలో వచ్చి వైద్యం అందించినట్లయితే ఇంతటి ఘోరం జరిగేదికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేట్టారు. ఈవిషయమై వివరణ కోరేందుకు విలేఖరులు ప్రయత్నించగా శశికళ స్పందించలేదు.

చిత్రాలు.. దేవరకొండ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చిన కవిత, వైద్యం అందక మృతి చెందిన మగశిశువు