తెలంగాణ

మరిన్ని కేంద్ర నిధులు రాబట్టేందుకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వచ్చేందుకు, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సకాలంలో ప్రతిపాదనలు పంపేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించి వెంటనే అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పిసింగ్ ఆదేశించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రూపొందించిన కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్ధను వినియోగించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ భవన్‌లో నెలకొల్పిన పర్యవేక్షణ వ్యవస్ధ, వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. కేంద్రం నుంచే వచ్చే నిధులు, రాష్ట్రప్రభుత్వం పంపే ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. కేంద్రం వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల నిధులను రాష్ట్రానికి విడుదల చేస్తున్న విషయం విదితమే. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం లేకుండా ఉన్నతాధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఈ విషయమై పట్టుదలతో ఉన్నారన్నారు. తెలంగాణ భవన్ రూపొందించిన మానిటోరింగ్ సిస్టమ్‌లో అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారన్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నివేదికలు, ఇంతవరకు ఖర్చుపెట్టిన నిధులు, వినియోగ పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.
ఇదిలా ఉండగా కేంద్రం నుంచి 2016-17 సంవత్సరంలో రూ. 13,557 కోట్ల నిధులు వచ్చాయి. కాగా 2017-18లో రూ 26,858 కోట్ల నిధులు రావాల్సి ఉందని ఈ ఏడాది బడ్జెట్‌లో అంచనావేశారు. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌లో రూ.14,557 కోట్లు నిధులు రావాల్సి ఉండగా, వెయ్యి కోట్లు తక్కువగా వచ్చాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా కింద 2015-16లో రూ. 12,351 కోట్లు వచ్చాయి. 2016-17లో రూ.13,955 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేశారు. కాగా ఈ మొత్తం రూ. 14,877 కోట్లు రావాలని సవరించిన బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2017-18లో దాదాపు రూ.17,005 కోట్ల నిధులు రావాలని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. గత ఏడాది కంటే ఈ ఏడాది 14.3 శాతం ఎక్కువగా కేంద్ర పన్నులో రాష్ట్రం వాటా నిధులు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనావేసింది.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పిసింగ్