తెలంగాణ

ఎవరినీ వదిలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: డ్రగ్స్ మాఫియా దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని, ఈ విషయంలో దోషులెవరైనా వదిలి పెట్టమని ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు తెలిపారు. సినీ పరిశ్రమను ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకుని విచారణ జరుపుతున్నారన్న అభియోగాల్లో వాస్తవం లేదని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లక్ష్యం మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేయడం జరిగిందని, మూడు వేల యూనిట్ల ఎల్‌సిడిని, 45 గ్రాముల కొకైన్, నార్కోటిక్, సైకోట్రోఫిక్ పదార్థాలను రికవరీ చేయడం జరిగిందన్నారు. సినిమా పరిశ్రమలోని 12 మందికి, 11 బార్లు, పబ్‌లకు నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. ఇదివరకే నోటీసులు ఇచ్చిన వారందరీ విచారణ ప్రారంభమైందని, వారు ఇచ్చే సమాచారంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 26 పాఠశాలలు, 27 కళాశాలలకు చెందిన కొంత మంది విద్యార్థులు, 25 ఐటి కంపెనీలకు చెందిన కొంత మంది ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్లు అరెస్టు అయిన వారు విచారణలో వెల్లడించారని ఆయన చెప్పారు. కాబట్టి డ్రగ్స్ బారిన ఎవరూ పడకుండా విద్యార్థుల తల్లిదండ్రులూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో అవసరమైతే భద్రత పెంచి ఈ డ్రగ్స్ కేసులో పురోగతి సాధిస్తామని మంత్రి పద్మారావు తెలిపారు.

చిత్రం.. ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు