తెలంగాణ

కాలుష్యకారక పరిశ్రమలపై క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌తో రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ పాటించని పరిశ్రమలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. కాలుష్యాన్ని నివారించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం నాడిక్కడ బేగంపేట క్యాంప్ కార్యాలయంలో జరిగిన పరిశ్రమల శాఖ, టిఎస్‌ఐఐసి, కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు అంశాలను సమీక్షించారు. జీడిమెట్ల, బాలానగర్ ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్ధాలను నాలాల్లో పడవేయకుండా నిఘా ఉంచేందుకు గాను 120 సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు టిఎస్‌ఐఐసి అధికారులు మంత్రికి తెలిపారు. త్వరలో చర్లపల్లి పారిశ్రామిక వాడలో కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కెమెరాల్లో రికార్డు అయినది అంతా పిసిబికి, పోలీసు శాఖకు చేరుతుందని తెలిపారు. కాలుష్య నియంత్రణకు పోలీసు సిబ్బంది అవసరం ఉందని మంత్రికి వారు వివరించారు. మంత్రి కెటిఆర్ స్పందిస్తూ ప్రతిపాదనలు ఇస్తే హోంమంత్రి, డిజిపిలకు ప్రత్యేకంగా లేఖ రాస్తానని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల సంఖ్య, వాటి నుంచి వచ్చే వ్యర్థాల పరిమాణం, వ్యర్ధాలను తరలిస్తున్న వాహనాల సంఖ్య తదితర వివరాలతో నివేదిక తయారు చేసి ఇవ్వాలని అన్నారు. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమైన మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్‌ఎంసి, ఇతర ప్రభుత్వ శాఖలకు నోటీసులు ఇచ్చినా ఇబ్బంది లేదని మంత్రి పిసిబి అధికారులకు చెప్పారు. కాలుష్య నివారణకు ఈపిటిఆర్‌ఐ సహకారంతో పని చేయాలని మంత్రి అన్నారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పోలేపల్లి సెజ్‌లోని రెండు కంపెనీలను మూసివేస్తున్నట్లు పిసిబి అధికారులు మంత్రికి తెలిపారు. ఈ కంపెనీలపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హుస్సేన్ సాగర్‌పైనా మంత్రి సమీక్షించారు. నగరంలోని చెరువులు, హుస్సేన్ సాగర్ సుందరీకరణపై మంత్రి మాట్లాడుతూ చెరువుల నుంచి వస్తున్న నురగపై వెంటనే నివేదిక ఇవ్వాలని తెలిపారు. హుస్సేన్ సాగర్‌లోకి మురికి నీరు రాకుండా 90 శాతం విజయం సాధించామని అన్నారు. రానున్న వినాయక నిమజ్జనం నాటికి 25 మినీ కొలనులను అభివృద్ధి చేశామని అధికారులు మంత్రికి వివరించారు. ట్యాంక్ బండ్ సుందరీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రికి అధికారులు తెలియజేశారు.

చిత్రం.. శనివారం బేగంపేట క్యాంప్ కార్యాలయంలో మంత్రి కెటిఆర్,
మేయర్ బొంతు రామ్మోహన్‌తో సమావేశమైన పరిశ్రమల శాఖ, టిఎస్‌ఐఐసి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు