తెలంగాణ

ఏపి ముందుకు వస్తే ‘విద్యుత్ బకాయిల’పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌కో (ఎపి ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో (టిఎస్ ట్రాన్స్‌కో) మధ్య విద్యుత్ బకాయిల విషయంలో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు తాము (టిఎస్ ట్రాన్స్‌కో) సిద్ధంగా ఉన్నట్టు టిఎస్ ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలంగాణకు ఎపి 1600 కోట్ల రూపాయలు బకాయిపడ్డదన్నారు. తెలంగాణ రాష్టమ్రే బకాయి ఉన్నట్టు ఎపి చేస్తున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ, కూర్చుని సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందామని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలపై సామరస్యంగా పరిష్కరించుకోవాలనే సూచించారని ప్రభాకర్‌రావు చెప్పారు. బకాయిల విషయంలో చర్చలకు ఎపి ముందుకు వస్తే తెలంగాణ ట్రాన్స్‌కో సిద్ధంగా ఉందన్నారు.