తెలంగాణ

నారుూ బ్రాహ్మణులకు పరికరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: రజకులకు, నారుూ బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం వచ్చే నెలలో వారికి పరికరాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ పరికరాలు అందించనున్నట్లు వారు సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. రజకులకు ఇచ్చే పరికరాలను ఈ నెల 31న నారుూబ్రాహ్మాణులకు ఇచ్చే పరికరాలను వచ్చే నెల 8న రవీంద్ర భారతిలో ప్రదర్శించనున్నట్లు వారు తెలిపారు. నారుూబ్రాహ్మణ, రజకుల సంక్షేమం కోసం, వారిని అన్ని విధాల ఆర్థికంగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని వారు చెప్పారు.
బిసిల సంక్షేమం కోసం 5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరించారు. 85 శాతానికి పైగా ఉన్న అణగారినివర్గాల వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
బ్యాంకుల ప్రమేయం తగ్గించి వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా చూస్తామన్నారు. ఎంబిసిలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామని వారు తెలిపారు. 119 రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా సంచార జాతుల పిల్లలకు నేరుగా అడ్మిషన్లు ఇస్తున్నామని వారు చెప్పారు. విద్య, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రులు ఈటల, జోగు రామన్న తెలిపారు.