తెలంగాణ

అక్బరుద్దీన్ కేసులో హైకోర్టులో ప్రభుత్వ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రప్రభుత్వం అప్పీలు పిటిషన్‌లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం రెండు పిటిషన్లను వేర్వేరుగా దాఖలు చేసింది. హత్యాయత్నం కేసులో తొమ్మిది మందిని నిర్దోషులుగా సెషన్స్ కోర్టు విడుదలచేయడాన్ని ప్రభుత్వం సవాలు చేసింది. మరో పిటిషన్‌లో కొంత మంది నిందితులకు పదేళ్ల శిక్ష వేయడాన్ని కూడా ప్రభుత్వం ప్రశ్నించింది.
3 లక్షల పరిహారం
యాసిడ్ దాడి బాధితురాలైన ట్రాన్స్‌జండర్‌కు మూడు లక్షల పరిహారం చెల్లించినట్టు లీగల్ సర్వీసు అథారిటీ అధికారులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ ముందు లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.