తెలంగాణ

డిటెన్షన్ సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో 5, 8 తరగతుల్లో డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం చేస్తున్న యోచనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనికి తోడు రానున్న రోజుల్లో డిగ్రీలోనూ డిటెన్షన్ అమలుచేసే యోచనలో కేంద్రం ఉంది. ఇది బలహీనవర్గాల విద్యార్థులకు నష్టం చేస్తుందని, ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల వెలుపలే ఉండిపోవల్సి వస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిటెన్షన్ విధానానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపాయి.
అయితే రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా వారికి నచ్చచెప్పి డిటెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోనూ డిటెన్షన్ విధానాన్ని అమలుచేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోందని, ఇది సరికాదని భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీల్లో డిటెన్షన్ విధానానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో కనీస వౌలిక సదుపాయాలు లేక సతమతమవుతున్నాయని, సరైన బోధన లేకుండా కాలేజీలు నడుస్తున్నాయని , సరిపడా బోధన సిబ్బంది లేరని, ఇలాంటి పరిస్థితుల్లో డిటెన్షన్ సరికాదని వారు చెప్పారు. ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేయాలని భావిస్తే డిగ్రీ కాలేజీలను మెరుగుపరిచి సిబ్బందిని, సౌకర్యాలను కల్పించాలని పేర్కొన్నారు.
ప్రతి మండల కేంద్రానికి ఒక డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని వారు పేర్కొన్నారు.