తెలంగాణ

సిద్దిపేటలో నారాయణ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 24 : రైతుల సమస్యలను పరిష్కరించాలని,వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం భారతీ కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన, జైలుభరో కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం జిల్లా కేంద్రంలో జైలుభరో కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దయానంద్‌రెడ్డి రెడ్డి వందలాది సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలు పట్టుకొని కొత్త బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎసిపి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మంద పవన్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు,కార్యకర్తలు హైదరాబాద్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, మెదక్ రోడ్డు, విక్టరీ చౌరస్తా మీదుగా వీరసావర్కర్ చౌరస్తాకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సిపిఐ నేత నారాయణను అడ్డుకోగానే పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఎసిపి, సిఐ నారాయణను బలవంతంగా ఎత్తుకొని డిసిఎం వ్యానులో వేశారు. సిపిఐ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలతో సిపిఐ నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. సిపిఐ నాయకులను, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి టూటౌన్ తరలిస్తుండగా గాంధీ చౌక్ సమీపంలో సిపిఐ నాయకులు వాహనానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వచ్చి ఆందోళన కారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నారాయణతో పాటు నాయకులను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.

చిత్రం.. నారాయణను ఎత్తుకొని వస్తున్న పోలీసులు