తెలంగాణ

సిపిఐ జైల్ భరో సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: వ్యవసాయదారులను ఆదుకోవడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడుతూ సోమవారం సిపిఐ తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ‘జైల్ భరో’ కార్యక్రమాన్ని నిర్వహించింది. జైల్ భరో కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులూ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన జైల్ భరో కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి ప్రసంగిస్తూ దేశంలో వ్యవసాయ సంక్షోభ నివారణకు లక్ష కోట్ల రూపాయలతో ‘వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి’ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పల్లా ప్రసంగిస్తూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సిబిఐ విచారణ జరిపించాలని, పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ ప్రసంగిస్తూ దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతాల్లో కరవు తీవ్రంగా తాండవిస్తున్నదని ఆయన తెలిపారు. అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వ భూములను కాపాడడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలమల్లేష్, పుస్తకాల నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు జైల్ భరో కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు.