తెలంగాణ

పారిశ్రామిక వాడలో హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలు పారిశ్రామిక వాడల్లో హరిత హారంలో భాగంగా టిఎస్‌ఐఎస్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటి మంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మల్లాపూర్ ఐడిఏ, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లో బాలమల్లు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిఎం కెసిఆర్ ఐదేళ్ల కాలంలో 240 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఆర్భాటాలకు దూరంగా తన పుట్టిన రోజు నాడు మొక్కలు నాటి పర్యావరణ, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తాము పారిశ్రామిక వాడల్లో మొక్కలు నాటుతున్నామని అన్నారు. మూడో విడత హరితహారంలో టిఎస్‌ఐఐసి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మొక్కలను నాటే లక్ష్యంతో ముందుకు పోతోందని చైర్మన్ బాలమల్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రోస్, స్టోర్ట్స్ అథారిటీ చైర్మన్లు కిషన్‌రావు, వెంకటేశ్వర రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు, పర్యావరణ విభాగం అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.