తెలంగాణ

‘్ఫ్యచర్ పర్‌ఫెక్ట్ కెటిఆర్’ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఒక్క రోజులో మంత్రి కాలేదని, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో అంకితభావంతో పని చేసి నాయకుడై, మంత్రి అయ్యాయరని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. సోమవారం నాడిక్కడ తాజ్ కృష్ణ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరక్టర్ దిలీప్ కొణతం రచించిన ‘్ఫ్యచర్ ఫెర్‌ఫెక్ట్ కెటిఆర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖరరెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ కెటిఆర్ రాజకీయాల్లోకి రావడం తొలుత కెసిఆర్ ఇష్టం లేదని అన్నారు. కెటిఆర్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తే కెసిఆర్ రెండు రోజుల పాటు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. రాజకీయాలకు పనికి రాడని విమర్శించిన వారే నేడు తమ రాష్ట్రాల్లో అలాంటి నాయకుడు లేడని బాధపడుతున్నారని అన్నారు. బస్తీ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు తనదైన మాటతీరుతో ప్రత్యేక ముద్ర వేసుకున్నారని కొనియాడారు. పుస్తక రచయిత దిలీప్ మాట్లాడుతూ కెటిఆర్ తీసుకున్న నిర్ణయాలు వెనుక ఉన్న నేపధ్యాన్ని, కష్టాన్ని ఈ పుస్తకంలో వివరించినట్లు తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్‌లో సోమవారం ‘్ఫ్యచర్ ఫెర్‌ఫెక్ట్ కెటిఆర్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మేయర్ బొంతు రామ్మోహన్