తెలంగాణ

గోరక్ష పేరిట మైనార్టీలపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజాకంటక పాలన సాగిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు, రైతాంగ సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తు దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు జైలుభరో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు. తెలంగాణ సిఎం కెసిఆర్ సొంత జాగీరు సిద్దిపేటలో జైలు భరో కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ పాత మిత్రుడని, సిద్దిపేటకు అతిథినని ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సొమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ అతృతతో త్వరగా నిర్ణయాలు తీసుకుంటాడని, బిజెపి అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయించుకొని, ఓటువేశారన్నారు. కాని బిజెపి నేతలు మరునాడే తెలంగాణలోప్రత్యామ్నాయంగా బిజెపి ఎదుగుతుందని టిఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేశారన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును తెలంగాణలో బిజెపి సిఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బిజెపి సర్కార్ గోరక్ష దళంతో మైనార్టీలను ఊచకోత కోస్తుందన్నారు. మతోన్నాదాన్ని సృష్టించేందుకు కుట్రలకు పాల్పడుతున్న బిజెపి పార్టీకి టిఆర్‌ఎస్ మద్దతు ఇవ్వటం విచారకరమన్నారు. నోట్లరద్దు, జిఎస్‌టి పథకాలో పేదలను ఇబ్బందలను గురిచేసిందన్నారు. సిఎం కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్, ల్యాండ్, ఇసుక మాఫీయా కొనసాగుతుందని నారాయణ ఆరోపించారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు అండదండలతో మూడు మాఫీయాలు కొనసాగుతున్నాయన్నారు. కెసిఆర్‌కు రాజకీయ జీవితం ప్రసాదించిన సిద్దిపేట అభివృద్ధికి సైతం పట్టించుకోవటం లేదని విమర్శించారు. బీడీ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. మంత్రి కెటిఆర్ సిరిసిల్లాలో చేనేత కార్మికుల సమస్యలను విస్మరించారన్నారు. నయిం మాపీయా కేసును తెలంగాణ సర్కార్‌ను నీరుగార్చిందన్నారు. గతంలో ఉన్న సిఎంలకు, హోంమంత్రులకు, డిజిపిలకు నయిం ముఠాతో సంబంధాలున్నాయన్నారు. నయిం కేసును సిబిఐ, సిట్‌చే విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు. అవాస్తవాలు చెపుతున్న హోం సెక్రటరీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాదక ద్రవ్యాల డ్రగ్స్ సరఫరాలో రాజకీయ హస్తం ఉందన్నారు. తీగ లాగితె డొంక కదులుతుందిన డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయో మూలాలను పట్టించుకోవటం లేదన్నారు.