తెలంగాణ

పన్ను మదింపుపై డేగకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: పన్ను మదింపుపై పూర్తి స్థాయి నిఘా ఉందని, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ, ఆంధ్రా ఆదాయపు పన్ను శాఖ ముఖ్య ప్రధాన కమిషనర్ ఎస్‌పి చౌదరి అన్నారు. పన్నుల వసూళ్లు సాఫీగా జరగాలంటే పటిష్టమైన పరిపాలన విధానం ఉండాలని అన్నారు. సోమవారం నాడిక్కడ జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్లో ‘ఆదాయపు పన్ను ఉత్సవాలు, సదస్సు’లో చౌదరి కీలకోపన్యాసం చేశారు. ఆదాయపు పన్ను శాఖ విధి నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారంతో ఎలక్ట్రానిక్ నిఘా పెంచామని తెలిపారు. పన్నుల వసూళ్లతో పాటు ఇతర సెటిల్‌మెంట్లను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా తమ ప్రయత్నం కొనసాగుతోందని అన్నారు. పన్నుల వసూళ్లలో సమానత్వం, సౌలభ్యం, సులభతరం వంటి అంశాలతో కూడిన విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపారు.
పాన్ కార్డు, ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా పన్ను చెల్లింపు దారుల సమాచారం వీలైనంత త్వరగా తెలుసుకోగలుగుతన్నామని అన్నారు. బ్యాంకుల ద్వారా జరిగిన లావాదేవీల వివరాలను చాలా సులభంగా తెలుసుకునేందుకు ఈ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతోందని చెప్పారు. భవిష్యత్‌లో లెక్కల్లోకి రాని ఆదాయం వివరాలను చాలా సులభంగా తెలుసుకునేందుకు ఈ పారదర్శక పన్నుల విధానం తోడ్పడుతుందని అన్నారు. ఈ సదస్సు ద్వారా వక్తలంతా పన్ను చెల్లింపు దారులకు మంచి సందేశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సోమవారం హైదరాబాద్‌లో ఆదాయపు పన్నుపై నిర్వహించిన సదస్సులో
తెలుగు రాష్ట్రాల కమిషనర్ ఎస్‌పి చౌదరి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ