తెలంగాణ

‘సేద్యం అభివృద్ధికి బ్రెజిల్ సహకారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ రంగాల్లో బ్రెజిల్ సహకారం అవసరమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. బ్రెజిల్ దేశం తరఫున తెలంగాణలో పర్యటించిన ఉన్నతాధికార బృందంతో తెలంగాణకు చెందిన వివిధ శాఖల అధికారులు చర్చలు జరిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశుపోషణ, టూరిజం తదితర రంగాల్లో తెలంగాణ పరిస్థితి గురించి అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి బ్రెజిల్‌లో పండిస్తున్న స్వీట్ ఆరెంజ్ జెర్మ్‌ప్లాజంను సరఫరా చేయాలంటూ వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి కోరారు. బ్రెజిల్‌లో పశువులు మంచి రకాలవి ఉన్నాయని, వాటి వీర్యాన్ని తెలంగాణకు సరఫరా చేయాలని పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా కోరారు. తెలంగాణ-బ్రెజిల్‌ల మధ్య పర్యాట, సాంస్కృతిక సంబంధాలను పెంచుకోవాలని, క్రీడల్లో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు పరస్పరం సహకరించుకుందామని పర్యాటక శాఖ కార్యదర్శి బి. వెంకటేశం బ్రెజిల్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని రంగాల్లో సహకారం ఇస్తామంటూ తోవర్ ద సిల్వ న్యూన్స్ హామీ ఇచ్చారు.