తెలంగాణ

‘అద్దెగర్భశిశువు’లపై ప్రభుత్వమే నిర్ణయించాలి: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ‘అద్దెగర్భశిశువు’ (సరోగసి) లను అసలైన తల్లిదండ్రులకు (కమిషన్డ్ పేరెంట్స్) అప్పగించే అంశంపై రాష్ట్రప్రభుత్వమే సరైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అద్దెగర్భస్థశిశువులపై సూమోటోగా నమోదైన కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి టి. రజనిలతో కూడిన డివిజన్ బెంచ్ మాట్లాడుతూ, చట్టానికి లోబడే సరోగసి శిశువుల అంశంపై ప్రభుత్వమే విధాన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సంబంధిత తల్లిదండ్రులకు శిశువులను అప్పగించాలంటూ తాము (కోర్టు) ఆదేశాలు జారీ చేయలేమని, ప్రభుత్వమే చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అద్దెగర్భానికి సంబంధించిన తల్లిదండ్రుల తరఫున న్యాయవాది వాదిస్తూ, ఇటీవల చాలా మంది సరోగసి తల్లుల కాన్పులు జరిగాయని, శిశువులకు జన్మనిచ్చారని, వీరిని సంబంధిత తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తరఫున న్యాయవాది బిఎస్ ప్రసాద్ వాదిస్తూ, అద్దెగర్భశిశువులకు నిలయంగా కొనసాగుతున్న బంజారాహిల్స్‌లోని సాయి కిరణ్ ఆసుపత్రి, కిరణ్ ఫెర్టిలిటీ సెంటర్‌లో అల్ట్రాస్కానింగ్ మిషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సరోగసి తల్లులు, శిశువుల కోసం వీటిని వినియోగించే ఏర్పాటు చేశామని, 48 మంది తల్లులు ఆసుపత్రిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ వైద్యుల బృందం తరచూ ఈ ఆసుపత్రికి వెళ్లి మాతాశిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందన్నారు. సరోగసి తల్లులు, శిశువుల ఫోటోలను కొన్ని టివిలు విపరీతంగా తమ టివీల్లో ప్రదర్శిస్తున్నాయని, కొన్ని పత్రికలు ఫోటోలను ప్రచురిస్తున్నాయని కిరణ్ ఆసుపత్రి, ఫెర్టిలిటీ కేంద్రం తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు లోబడి తాము ఇన్‌ఫెర్టిలిటీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాలని, సరోగసి తల్లులు, పిల్లల ఫోటోలను ప్రదర్శించడం, ప్రచురించడం మంచిది కాదని కోర్టు పేర్కొంది.