తెలంగాణ

బోర్డులపై జిఎస్‌టిన్ నెంబర్ రాయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రంలో వర్తకులు, వాణిజ్యవేత్తలంతా తమ వ్యాపార భవనాలపై ఏర్పాటు చేసే సైన్‌బోర్డులపై ‘జిఎస్‌టిన్’ నెంబర్లు తప్పనిసరిగా రాయాలని రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ వి. అనిల్‌కుమార్ తెలిపారు. జిఎస్‌టి పరిధిలోకి వచ్చే డీలర్లు, వ్యాపారులకు ఆయన గురువారం కొన్ని సూచనలు చేస్తూ, ప్రకటన చేశారు. ప్రతి వ్యాపారస్తుడు, దుకాణదారుడు తమ దుకాణాల్లో, కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్‌ను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. 200 రూపాయలు ఆ పైగావస్తువులను కొనుగోలు చేస్తే తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, వినియోగదారులు 200 రూపాయలలోగా వస్తువులకు బిల్లు కావాలని కోరితే ఇవ్వాలని సూచించారు.