తెలంగాణ

పాఠశాలలు మూసివేతపై ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: పాఠశాలలు మూసివేతకు నిరసనగా ధర్నా నిర్వహించిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గన్ పార్కు వద్ద కమిటీ శాంతియుతంగా చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు భగ్నం చేసి నేతలను అరెస్టు చేయడాన్ని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇ రఘునందన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పేదవర్గాలు చదివే ప్రభుత్వ బడులను మూసివేయడం అన్యాయమని, ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల్లో కనీస వౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని అన్నారు.
బైపిసి కౌనె్సలింగ్
ఎమ్సెట్ బైపిసి అభ్యర్ధుల సర్ట్ఫికేట్ల పరిశీలన కార్యక్రమం గురువారం నాడు జరిగింది. ఉదయం 9 గంటలకే అభ్యర్ధులను రమ్మని పిలిచినా సెర్వర్లు పనిచేయక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానాఅగచాట్లు పడ్డారు. చివరికి మధ్యాహ్నం సెర్వర్లు పనిచేయడంతో అంతా ఊపిరి తీసుకున్నారు.
తోలి రోజు 32వేల వేల ర్యాంకు వరకూ అభ్యర్థులను పిలువగా, అందులో 4489 మంది మాత్రమే హాజరయ్యారు. శుక్రవారం నాడు 32001 నుండి 53వేల ర్యాంకు వరకూ, అలాగే స్పెషల్ కేటగిరి అభ్యర్థులను పిలిచినట్టు కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ చెప్పారు.
4 నుండి డీసెట్ కౌనె్సలింగ్
రెండేళ్ల డిఇడి కోర్సులో చేరేందుకు డీ సెట్ కౌనె్సలింగ్ ఆగస్టు 4 నుండి ప్రారంభం కానుంది. అభ్యర్ధులు తమ వెబ్ ఆప్షన్లను ఆగస్టు 4 నుండి 7వ తేదీ వరకూ ఇవ్వాలని , సీట్ల కేటాయింపు ఆగస్టు 10న జరుగుతుందని పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు. అభ్యర్థులు ఆగస్టు 10 నుండి 19వ తేదీలోగా ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాలేజీలు ఆగస్టు 18 నుండి ప్రారంభం అవుతాయి.
పాఠశాలలు మూత సరికాదు
పాఠశాలలను మూసివేయడం ఎంత మాత్రం సరికాదని భారత విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, కార్యదర్శి కోట రమేష్‌లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకవైపు పాఠశాలలను మూసివేయడం లేదంటూనే మరో వైపు కొన్ని స్కూళ్లను హైస్కూళ్లలో విలీనం చేస్తోందని ఇది దుర్మార్గమని వారు చెప్పారు.
అర్హత పరీక్ష గడువు పెంపు
బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్హత పరీక్ష -2017 రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించినట్టు వర్శిటీ అధికారులు తెలిపారు. బిఇడి, బిఇడి (ఎస్‌ఇ) కోర్సులకు కూడా ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకూ పొడిగించినట్టు వారు చెప్పారు.