తెలంగాణ

మున్సిపల్ కమిషనర్లకు అదనంగా మ్యారేజ్ ఆఫీసర్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: మున్సిపల్ కమిషనర్లకు అదనంగా మ్యారేజ్ ఆఫీసర్ హోదాను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు సబ్ రిజిష్ట్రార్ మాత్రమే వివాహాలను నమోదు చేసుకుని, ధృవీకరణ పత్రం సమర్పిస్తున్నారు. ఇప్పుడు స్ధానిక సంస్థల్లోనూ వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. జిహెచ్‌ఎంసి సహా రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లు వివాహ సమాచారాన్ని నమోదు చేసుకుని, ధృవీకరణ (సర్ట్ఫికెట్) పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి పురపాలక శాఖ డైరక్టర్ సర్క్యులర్‌ను ఇటీవల జారీ చేశారు. వివాహాన్ని నమోదు చేసుకునేందుకు వచ్చే వధూ వరుల నుంచి ఫార్మెట్‌లో ఉన్న మెమోరాండంను సమర్పించాల్సి ఉంటుంది. దానిలో ఇద్దరికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరుస్తారు. ఇద్దరి తరఫున ఇద్దరేసి సాక్ష్యులు సంబంధిత అధికారి ముందు సంతకం చేయాల్సి ఉంటుందని, వధూవరుల నుంచి తీసుకునే డిక్లరేషన్ అన్నీ స్పష్టంగా రిజిష్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల నమోదైన వివాహాల జాబితాను మున్సిపల్ కమిషనర్లంతా పురపాలక శాఖ డైరక్టర్ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఉన్న పనిభారానికి ఈ బాధ్యత అదనంగా మోపుతున్నారని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపల్ కార్యాలయంలో ఉన్న పౌర సేవా కేంద్రం (సిఎస్‌సి) ద్వారా ఈ వివాహ నమోదు, ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.