తెలంగాణ

ఏసిబికి చిక్కిన పరిశ్రమల శాఖ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఇంటిపై ఏసిబి అధికారులు దాడి చేశారు. కూకట్‌పల్లి ఆదిత్యనగర్‌లో నివాసముంటోన్న తెలంగాణ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఎడ్ల గంగాధర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. గంగాధర్‌రెడ్డి ఇంటితో సహ అతని బంధువులు, పలుచోట్ల ఆస్తులపై ఏసిబి ఆరా తీస్తోంది. ఏకకాలంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, నిజామాబాద్, ఆర్‌సిపురం, హబ్సిగూడ కార్యాలయాలలో ఏసిబి అధికారులు తనిఖీలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు గుర్తించారు. ఈ తనిఖీల్లో 85 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు ఇళ్లతోపాటు ఎనిమిది ఇంటి స్థలాల ప్లాట్లు కలిగివున్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లిలో రూ. 85 లక్షలు విలువచేసే డూప్లెక్స్ భవంతి, నిజామాబాద్‌లో రూ. 30 లక్షలు విలువచేసే జి+2 భవంతి, నిజామాబాద్ జిల్లాలో రూ. 55.4 లక్షలు విలువచేసే 5 ఎకరాల వ్యవసాయ భూమి, షాద్‌నగర్‌లో రూ. 1.62 లక్షలు విలువచేసే 13గుంటల భూమి, రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లో రూ. 30 లక్షలు విలువచేసే ఒక ప్లాటు, గాజుల రామారంలో రూ. 13.34 లక్షలు విలువచేసే ఓపెన్ ప్లాట్, మెదక్ జిల్లా పటాన్‌చెరువులో 9.33 లక్షలు విలువచేసే ఒక ప్లాట్, మేడ్చల్ జిల్లా కీసరలో రూ. 6.12 లక్షలు విలువచేసే ఓపెన్ ప్లాట్, షాద్‌నగర్‌లో రూ. 1.33 లక్షలు విలువ చేసే మరో ఓపెన్ ప్లాట్, రూ. 2 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు, రూ. 6.15 లక్షలు నగదుతోపాటు రూ. 17.25 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, రూ. 17.32 లక్షలు వివిధ చిట్‌ఫండ్స్‌లో డిపాజిట్లు, రూ. 5.57 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 10 లక్షలు విలువచేసే గృహోపకరణ వస్తువులు, రూ. 1 లక్ష విలువచేసే బైక్, రూ. 4 లక్షలు విలువచేసే ఇండికా కారు, రూ. 50వేలు విలువచేసే హోండా యాక్టివాను ఏసిబి అధికారులు గుర్తించారు. మొత్తం రూ. 3 కోట్ల ఆస్తులు, కాగా వీటి విలువ మార్కెట్లో రూ. 12 కోట్లకు పైగా ఉంటుందని ఏసిబి అధికారులు పేర్కొన్నారు. నిందితుడు గంగాధర్‌రెడ్డిని అరెస్టు చేసి ఏసిబి కోర్టులో హాజరుపరిచినట్టు ఏసిబి డైర్టెర్ తెలిపారు.

చిత్రం.. హైదరాబాద్‌లో గురువారం పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్
గంగాధర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసిబి అధికారులు