తెలంగాణ

గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడానికి పకడ్భంది ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, గత ఏడాది మాదిరిగానే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం ‘వీరుల సైనిక్ స్మారక్’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ పతాక అవిష్కరణ చేస్తారన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పునస్కరించుకుని రాజ్‌భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్ తదితర ముఖ్యమైన ప్రాంతాలలో విద్యుద్ధీపాలతో అలంకరించాలని సిఎస్ ఆదేశించారు. గోల్కొండకు వెళ్లే మార్గాలలో సైన్ బోర్డులు, పరిసరాల శుభ్రత, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ వేడుకలకు వెళ్లే వారి కోసం మినీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. వేదిక వద్ద తెలంగాణ సంస్కృతిని ప్రతిబంభించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏక్ భారత్‌లో భాగంగా హర్యాన సాంస్కృతిక కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శన ఇస్తారన్నారు. వేడుకలను స్పష్టంగా తిలకించడానికి ఎల్‌ఇడి స్కీృన్లను అమర్చాలన్నారు. గోల్కొండ వద్ద పార్కింగ్‌తో పాటు బ్యారికేడ్స్, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్, ఆర్ అండ్ బి, జిహెచ్‌ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్, వైద్య, విద్య, హార్టీకల్చర్, ఫైర్, ఆర్కీయాలజీ, సాంస్కృతిక శాఖ, ఆర్టీసి, సమాచారశాఖ, విద్యుత్‌శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. గురువారం సచివాలయంలో స్వాతంత్య్ర వేడుకలపై అధికారులతో సమీక్షిస్తున్న సిఎస్