తెలంగాణ

మాఫియాలకు కెసిఆర్ ఫిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నది కెసిఆర్ కాదని, పలు మాఫియాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. భూమి, ఇసుక, డ్రగ్స్, గనుల మాఫియాలు రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని అన్నారు. గురువారం నాడిక్కడ హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, జివో 58 కింద దరఖాస్తు చేసుకున్న అందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ వేలాదిమందితో ధర్నా నిర్వహించారు. సిపిఐ నగర సమితి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణ, తెలంగాణ సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ భూదాన్, నిజాం భూములు వేల ఎకరాలను కబ్జాల నుంచి కాపాడి డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భూములన్నీ దళారులు, భూ మాఫియా చేతుల్లో ఉండిపోయాయని వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తెలంగాణ వస్తే మన భూములు మనకే దక్కుతాయన్న కెసిఆర్ ఇప్పటి వరకు ఎన్ని భూములను స్వాధీనం చేసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పేదలకు డబుల్‌బెడ్ రూం ఇళ్ల స్థలాలు మేమే చూపిస్తామని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదని కెసిఆర్ సర్కార్‌పై చాడ మండిపడ్డారు.
ఈడి ప్రతినిధులను నియమించాలి
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ఎక్సైజ్ శాఖ నియమించిన స్పెషల్ ఇన్‌వెస్టిగేషన్ టీం (సిట్)లో నార్కోటిక్స్, డిఆర్‌ఐ, ఈడి ప్రతినిధులకు స్ధానం కల్పించాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నార్కోటిక్స్, డిఆర్‌ఐ, ఈడి విభాగాలకు అందించాలని కోరారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు ఆయన లేఖ రాశారు. నిబందనలకు విరుద్దంగా నడుపుతున్న పబ్‌లను వెంటనే నిలిపివేయాలని, విష సంస్కృతికి మూలమవుతున్న క్లబ్బులు, పబ్బులు, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లను నియంత్రించాలని కోరారు. డ్రగ్స్‌ను నియంత్రించే ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. సిట్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.

గురువారం హైదరాబాద్‌లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో
పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ నేత నారాయణ