తెలంగాణ

35 శాతం పైగా మూడో దశ హరితహారం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: రాష్ట్రంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం మూడవ దశ 35 శాతానికి పైగా పూర్తయ్యిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. తాజా లెక్కల ప్రకారం మొత్తం 31 జిల్లాల్లో ఇప్పటి వరకు 40 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. రుతుపవనాల విరామం ఉన్నందున మొక్కల రక్షణకు తగిన తీసుకోవాలని, ఎక్కువ మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సూచించారు. రోజు వారీ నివేదికలతో సిఎం కెసిఆర్, నిత్యం జిల్లాల పర్యటనల ద్వారా అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారని అన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో మొక్కల రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటిని వెంటనే తొలగించి కొత్త మొక్కలు నాటాలని సూచించారు.వీడియో కానె్ఫరెన్స్‌లో అదనపు అటవీ సంరక్షణ అధికారులు ఆర్.ఎం.డోబ్రియల్, మునీంద్ర, ఫృధ్వీరాజ్, లోకేశ్ జైస్వాల్, సునీల్‌కుమార్ గుప్తా పాల్గొన్నారు.