తెలంగాణ

సమస్యలు పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: సెర్ప్ ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, ప్రాధాన్యత క్రమంలో అన్ని అంశాలను పరిశీలిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. శుక్రవారం సచివాలయంలో తెలంగాణ ఐకెపి, సెర్ప్ ఉద్యోగ సంఘంతో మంత్రి సమావేశమయ్యారు. హెచ్‌ఆర్ పాలసీ పరిధిలో ఉన్న సెర్ఫ్ ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి సర్వీస్‌ను పునరుద్దరించుకోవాలన్న నిబంధనను సడలించడంపై సానుకూలంగా స్పందించారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాన్ని మూడేళ్ల కాలపరిమితికి పొడిగించేందుకు అంగీకరించారు. గ్రాస్ సాలరీపై 30 శాతం వేతనాన్ని ఇవ్వడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సెర్ప్ సిఈఓ పౌసమీ బసును ఆదేశించారు. ఎలాంటి పోస్టులను తగ్గించడం జరగదని మంత్రి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంత వీలైతే అంత చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి అన్నారు. అయితే ఉద్యోగులు కూడా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు.