తెలంగాణ

ఇప్పుడు పండుగలన్నీ ఘనంగా జరుపుకుంటున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పండుగలన్నీ ఘనంగా నిర్వహించుకుంటున్నామని పశు సంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. బోనాలను ప్రశాంతం నిర్వహించుకున్నామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడిక్కడ మంత్రి నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గంలోని 200 దేవాలయాల కమిటీలకు రూ.53.55 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బోనాల నిర్వహణకు ఆయా ఆలయ కమిటీలు చేసిన ఖర్చులను ఆధారం చేసుకుని ఈ నిధులను మంత్రి చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది బోనాల నిర్వహణకు రూ.10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, దుస్తులను పంపిణీ చేశారని గుర్తు చేశారు. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు.