తెలంగాణ

మూడేళ్లలో హైదరాబాద్‌లో 57 పబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వ్యాపారం జోరందుకోవడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేనని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లలో 57 పబ్‌లు ఏర్పాటయ్యాయని అన్నారు. ముంబయి, బెంగుళూరులో అనుమతించని డిజే షోలను తెలంగాణ ప్రభుత్వం స్వాగతించడం దారుణమని అన్నారు. శుక్రవారం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి డ్రగ్స్, డిజే షోలలో అధికార పార్టీలో ఉన్నత స్ధానంలో ఉన్న నేతల బంధువులతో సంబంధాలను విలేకరులకు వివరించారు. ముంబయి, బెంగుళూరులో ఆ రాష్ట్ర పోలీసులు అనుమతులు నిరాకరించిన పబ్ సంస్ధలకు అధికార పార్టీకి చెందిన వారు తెలంగాణకు తీసుకువచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను నాశనం చేస్తూ తెలంగాణపై మాయని మచ్చ వేస్తున్న డ్రగ్స్ వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, ఇందుకు అవసరమైతే తాము కూడా మద్దతు ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మాదక ద్రవ్యాలకు అండగా ఉన్న వారిని ఎన్‌కౌంటర్ చేస్తే ఎవరూ అడ్డురారని సిఎంకు ఆయన సూచించారు. విలేకరుల సమావేశంలో టిటిడిపి అధికార ప్రతినిధి సతీష్‌మాదిగ, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూధన్‌రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.