తెలంగాణ

వచ్చే ఎన్నికల్లోనూ బిజెపిదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: వచ్చే ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించడం ఖాయమని ఉప రాష్టప్రతి అభ్యర్ధి ఎం వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నరేంద్రమోదీ ప్రధాని అవుతారని పేర్కొన్నారు. ఉప రాష్టప్రతి అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత నగరానికి తొలి సారి వచ్చిన వెంకయ్యనాయుడును పార్టీ నాయకులు అంతా మే ఫెయిర్ కనె్వన్షన్ సెంటర్‌లో ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తానెన్నడూ పదవుల కోసం వెంట పడలేదని, పదవులు వద్దనుకోలేదని అలాగని తాను కావాలని కోరుకోలేదని వ్యాఖ్యానించారు. 2019లో జరిగే ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్రమోదీ ఎన్నిక తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నానని, ఇదే విషయం తన కుటుంబ సభ్యులకు, ప్రధానికి కూడా చెప్పానని అన్నారు. ఏ బాధ్యతలో ఉన్నా తాను తెలుగు వారికి గర్వకారణంగా వ్యవహరిస్తానని చెప్పారు.
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఏదైనా సాధించగలమని, అవకాశవాద రాజకీయాలకు దూరంగా, సిద్ధాంత పరంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశం, సమాజం కోసం పనిచేయడం మన కర్తవ్యమని తెలిపారు. క్రమశిక్షణ, అంకిత భావంతో కార్యకర్తలు పనిచేయాలని, శక్తి సామర్ధ్యాలతో పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి తానే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు.
ప్రజాబలం ఉంటే గుర్తింపు తనంతట అదే వస్తుందని చెప్పారు. ఏ పార్టీ వారైనా సొంత లాభం కొంత మానుకుని సమాజం కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు జి కిషన్‌రెడ్డి, ఎన్ రామచంద్రరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తదితర బిజెపి నేతలు హాజరయ్యారు.

చిత్రం.. శుక్రవారం హైదరాబాద్‌లో బిజెపి నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో
ప్రసంగిస్తున్న ఎన్డీఏ ఉప రాష్టప్రతి అభ్యర్థి వెంకయ్యనాయుడు